బాబు ప్రచారానికి రూట్‌ మ్యాప్‌ రెడీ..

బాబు ప్రచారానికి రూట్‌ మ్యాప్‌ రెడీ..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తొలి జాబితా విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. ప్రచారానికి ప్లాన్‌ రెడీ చేశారు. రేపటి నుంచి ఆయన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రేపు ఉదయం తిరుపతిలో స్వామి వారిని బాబు దర్శించుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతిలో సేవామిత్ర, బూత్ కమిటీలతో సమావేశమవుతారు. సాయంత్రం శ్రీకాకుళం సభలో పాల్గొంటారు. 17న విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో.. 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో.. 19న కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో సభలు నిర్వహిస్తారు చంద్రబాబు. ఈ సభల తర్వాత బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి రూట్‌ మ్యాప్‌ను టీడీపీ నేతలు సిద్ధం చేశారు. మంత్రి లోకేష్‌ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. బాబు ఒక ప్రాంతంలో.. లోకేష్ టూర్ ఇంకో ప్రాంతంలో ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.