చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీలో టీడీపీ విజయం ఖాయమని.. 100 శాతం కాదు.. 1000 శాతం గెలుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ పార్టీ అభ్యర్థులతో ఆయన అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన కోసం క్యూలో వుండి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞలు చెప్పాలని సూచించారు. 'మీరు ముందుండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి.. ప్రజల అవసరాలు తీర్చండి..' అని ఆదేశించారు. చరిత్రలో ఇంతటి దుర్మార్గపు ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్న బాబు.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తమదే విజయం అని అన్నారు. జూన్‌ 8 దాకా మన ప్రభుత్వం ఉందని, ఫలితాలు వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. క్యాంప్‌ ఆఫీసులో సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టుకోవద్దా అని ప్రశ్నించిన బాబు.. ప్రధాని మోడీ మాత్రం మంత్రివర్గ సమావేశం పెట్టుకోవచ్చా అని నిలదీశారు. మనం మళ్లీ అధికారంలోకి రాకుండా అన్ని విధాలుగా అడ్డుకుంటున్నారని బాబు అన్నారు.