అందుకే వైసీపీ గెలిచింది: బాబు

అందుకే వైసీపీ గెలిచింది: బాబు

రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పనిచేశామని.. కాలంతో పరుగెత్తి అనేక పనులు పూర్తి చేశామని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతోపాటు మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేశామని గుర్తు చేశారు. కానీ.. ప్రజాతీర్పు భిన్నంగా వచ్చిందని, ప్రజల అంచనాలు వేరుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రజల కోపం వల్ల  తాము ఓటమి చెందలేదని.. జగన్‌పై ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించిందని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో కొంతకాలం వేచిచూద్దామని బాబు అన్నారు. నిశితంగా గమనించి.. ఆ తర్వాతే స్పందిద్దామన్నారు. ఇక.. ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ముగ్గురు మినహా అందరూ గతంలో పనిచేసినవారేనన్నారు.