'పింఛన్లు ఇచ్చి.. రుణ మాఫీ చేస్తే తప్పా?'

'పింఛన్లు ఇచ్చి.. రుణ మాఫీ చేస్తే తప్పా?'

కేంద్రం నుంచి ఏపీకి కనీసం రూ.75 వేల కోట్లు రావాలని నిపుణులు, తటస్థులే చెబుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తటస్థులు ఇచ్చిన నివేదికలను కూడా కేంద్రం పట్టించుకోదా అని ఆయన ప్రశ్నించారు. ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ నరేగాకు, పోలవరానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నా ఏపీ బీజేపీ నేతలు కేంద్రాన్ని ఎందుకు నిలదీయరు..? అని ఆయన ప్రశ్నించారు. పేదలకు పింఛన్లు మంజూరు చేసి, రైతులకు రుణ మాఫీ చేస్తే.. వాటిని చూపించి ఆర్థిక లోటులో కోత పెట్టారని బాబు అసహనం వ్యక్తం చేశారు. ఫించన్లు ఇచ్చి.. రుణ మాఫీ చేస్తే తప్పా..? అని బాబు ప్రశ్నించారు.