దగ్గుబాటిపై బాబు తీవ్ర విమర్శలు
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి వ్యవహార శైలిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ముఖ్య నేతలతో ఇవాళ చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరిందన్నారు. దగ్గుబాటి మారని పార్టీలు లేవన్న ఆయన.. ఆర్ఎస్ఎస్ మొదలు అన్ని పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేశారని విమర్శించారు. బీజేపీ.. కాంగ్రెస్.. బీజేపీ.. ఇప్పుడు వైసీపీ.. ఇలా రకరకాల పార్టీలు మారారని విమర్శలు చేశారు. 'కాంగ్రెస్ హయాంలో ఆమె కేంద్రమంత్రి, ఈయన ఎమ్మెల్యే. ఆ తర్వాత కాంగ్రెస్ను వదిలేసి బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు వైసీపీలో చేరారు. అధికారం కోసమే వీళ్ల ఫిరాయింపులన్నీ' అని విమర్శించారు. ఇక.. అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైసీపీతో కుమ్మక్కు అయ్యారని బాబు అన్నారు. అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్ను వాడుకున్నారని.. వీళ్ల అవకాశవాదంతో ఎన్టీఆర్కు అప్రతిష్ట తీసుకొచ్చారని మండిపడ్డారు. అవకాశ వాదులంతా వైసీపీ గూటికి చేరారని అన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)