నేనంటే ఏంటో 'మహానాయకుడు' చూస్తే తెలుస్తుంది..

నేనంటే ఏంటో 'మహానాయకుడు' చూస్తే తెలుస్తుంది..

ఆదాయం రాని రైల్వే జోన్‌ను కేంద్రం ప్రకటించిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ కర్నూలులో ఆయన మాట్లాడుతూ వాల్తేరు డివిజన్ లేకుండా చేశారని.. నిలదీస్తే దాడి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి దాడులకు తాను భయపడనని స్పష్టం చేశారు. 'నేను భయపడతానో లేదో మహానాయకుడు సినిమా చూస్తే మోడీకి తెలుస్తుంది. నేనంటే ఏంటో ఆ సినిమా చూస్తే తెలుస్తుంది' అని అన్నారు. .24 కేసులు వేసినా తాను భయపడలేదని.. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడతానా అని ప్రశ్నించారు.

 'ఏపీలో కోడి కత్తి పార్టీ ఉంది. విశాఖ జోన్ గురించి, ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఆ పార్టీ మాట్లాడదు. కేంద్రాన్ని ఎందుకు నిలదీయదు?' అని బాబు ప్రశ్నించారు.