ఇకపై ఇక్కడి నుంచి బాబు కార్యకలాపాలు..

ఇకపై ఇక్కడి నుంచి బాబు కార్యకలాపాలు..

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా ఇవాళ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇక నుంచి గుంటూరు కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ప్రతి రోజూ గుంటూరు పార్టీల కార్యాలయంలో మూడు గంటలపాటు ఉండి.. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయాలని నిర్ణయానికి వచ్చారు. మంగళగిరిలో కార్యాలయ నిర్మాణం పూర్యయ్యేవరకు ఇక్కడి నుంచే బాబు.. కార్యాక్రమాలను నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఇక.. ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలుకు వైసీపీ ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని, ఆ తర్వాతే స్పందించాలని టీడీపీ నిర్ణయించింది. టీడీపీ కార్యకర్తలపై దాడుల విషయంలో స్పందించేందుకు అవసరమైతే ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని నియమించాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిసింది.