చంద్రబాబు దీక్షలో తెలుగుతల్లి ప్రత్యక్షం

చంద్రబాబు దీక్షలో తెలుగుతల్లి ప్రత్యక్షం

కేంద్రం వ్యహరిస్తున్న తీరును నిరసిస్తూ సీఎం హోదాలో చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్షను చేపట్టారు. ఏపీ భవన్ లోని దీక్షా ప్రాంగణానికి పలువురు జాతీయ నాయకులు తరలివచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. వేదికపై తెలుగుతల్లి వేషధారణలో ఉన్న ఓ మహిళ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె ఎవరో కాదు.. ఏపీ ప్రభుత్వ మహిళా ఉన్నతాధికారి. చంద్రబాబు దీక్షతో ఏపీ భవన్ కిక్కిరిసిపోవడంతో పక్కనే ఉన్న కేరళ హౌస్ లో తెలుగు తల్లిలా ముస్తాబైంది. అక్కడి నుంచి నడుచుకుంటూ సభాస్థలి వద్దకు వచ్చింది. సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.