అది నిరూపిస్తే.. రాజకీయాలకు గుడ్‌బై: బాబు

అది నిరూపిస్తే.. రాజకీయాలకు గుడ్‌బై: బాబు

పోలవరం పనులు రికార్డు స్థాయి వేగంతో జరుగుతున్నాయని.. దేశంలో మరే ఇతర ప్రాజెక్ట్ పనులైనా ఈ స్థాయిలో జరుగుతున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పోలవరానికి జాతీయ స్థాయిలో అవార్డు ఇచ్చారని.. ఇప్పటి వరకు 65 శాతం పనులు పూర్తిచేశామని గుర్తు చేశారు. నదుల అనుసంధానంపై తిరుపతిలో మాటిచ్చిన మోడీ.. ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదని అసహనం వ్యక్తం చేశారు. గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఏకైక రాష్ట్రం ఏపీయేనన్న బాబు.. కోర్టులకు వెళ్తూ పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టును వైసీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు.