నేడు రాహుల్‌, మాయ, అఖిలేష్‌తో బాబు భేటీ..

నేడు రాహుల్‌, మాయ, అఖిలేష్‌తో బాబు భేటీ..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న మధ్యాహ్నం ఎన్నికల కమిషన్‌ అధికారులను కలిసిన చంద్రబాబు .. వెంటనే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులో భేటీ అయ్యారు. అక్కడి నుంచి 'ఆమ్‌ ఆద్మీ పార్టీ' అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లిన చంద్రాబాబు దాదాపు అరగంట పాటు సమాలోచనలు చేశారు. ఎన్నికల  ఫలితాల అనంతరం పరిణామాలు, మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై ఆయా నేతలతో బాబు చర్చించినట్టు తెలిసింది.

ఇవాళ రెండో రోజు.. ఉదయం 9.30 గంటలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ అవుతారు. ఎన్నికల తర్వాత విపక్ష సమావేశానికి ఏయే పార్టీలను ఆహ్వానించాలనే అంశంపై చర్చిస్తారు. ఈ భేటీ అనంతరం బాబు ఉత్తరప్రదేశ్‌ వెళ్తారు. ముందుగా బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అవుతారు. అనంతరం ఎస్పీ నేత అఖిలేష్‌యాదవ్‌లో సమావేశమవుతారు.