'తిరుగుబాటు తప్ప మరో మార్గం లేదు'

'తిరుగుబాటు తప్ప మరో మార్గం లేదు'

భావితరాల కోసమే ధర్మపోరాటం చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న ధర్మ పోరాట దీక్షలో ఆయన మాట్లాడుతూ  11 రాష్ట్రాలకు హోదా ఇచ్చారని.. ఏపీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్రంలోని పెద్దలు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. వెంకన్నసాక్షిగా ఇచ్చిన హామీని మోడీ విస్మరించారని విమర్శించారు. కేంద్రంపై తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేదన్న బాబు.. రాష్ట్రానికి న్యాయం చేసేందుకే ఎన్డీయే నుంచి బయటికొచ్చామని స్పష్టం చేశారు. న్యాయం చేయమని అడిగితే దాడులు చేస్తున్నారని.. ఎంపీలు నోరు ఎత్తితే ఐటీ దాడులు చేయిస్తున్నారని అన్నారు.