'మీ మద్దతుంటే కొండనైనా ఢీకొంటా..'

'మీ మద్దతుంటే కొండనైనా ఢీకొంటా..'

ప్రధాని నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోయి మన హక్కులను సాధించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ శ్రీకాకుళంలో ధర్మ పోరాట దీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రజల మద్దతు ఉంటే కొండనైనా ఢీకొడతానని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో కట్టు బట్టలతో బయటకు వచ్చామన్నారు. 'ప్రత్యేక హోదా అన్నారు...తర్వాత ప్యాకేజీ అన్నారు...ఇప్పుడు ఏమీ ఇవ్వమంటున్నారు. చట్టంలో పొందుపర్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నా..మన ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాల్సిందే' అని అన్నారు. మనం తిరగబడ్డామని ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకున్నారన్న బాబు.. విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ ఇవ్వాల్సిందేన్నారు. ఇక.. తిత్లీ, పెథాయ్ తుఫాన్లు వచ్చినా ప్రతిపక్ష నేత జగన్‌ను పట్టదని.. తెలంగాణలో టీఆర్ఎస్ తెలిస్తే జగన్ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు.