రాష్ట్రాభివృద్ధికి ఆ ఇద్దరే అడ్డు: బాబు

రాష్ట్రాభివృద్ధికి ఆ ఇద్దరే అడ్డు: బాబు

ఎన్నికలయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని.. చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ శ్రీకాకుళంలోఆయన మాట్లాడుతూ పేపర్ బ్యాలెట్ ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని.. అభివృద్ధి చెందిన దేశాలన్నీ పేపర్ బ్యాలెట్ విధానాన్నే అనుసరిస్తున్నాయని చెప్పారు. తెలుగువాళ్లందరికీ కావాల్సిన నగరం అమరావతి అని.. ప్రజల సహకారంతో అమరావతిని ప్రపంచంలోనే అత్యున్నత నగరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా ప్రతిపక్షాలు అడ్డు పడుతున్నాయన్న బాబు.. అవమానాన్ని భరించి..ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని తెలిపారు. రాజకీయం, అధికారం ముఖ్యం కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని బాబు స్పష్టం చేశారు.