చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పార్టీ ఎమ్మెల్సీలతో ఇవాళ జరిగిన భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వ్యవహారాలపై ఆరు నెలలు మౌనంగా ఉండాలని భావించామని.. కానీ కార్యకర్తలపై దాడులు, బెదిరింపు ధోరణి నేపథ్యంలో సమయం ఇవ్వడం అనవసరమని అనిపిస్తోందని అన్నారు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు, బురద జల్లే కార్యక్రమాల మొదలయ్యాయన్న బాబు.. సంఘీభావ ర్యాలీలతో కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని నేతలకు సూచించారు. ప్రతి అంశాన్నీ అధ్యయనం చేయాలన్న స్పష్టం చేశారు.