రాజ్‌ఘాట్‌లో బాబు.. మహాత్ముడికి నివాళి..

రాజ్‌ఘాట్‌లో బాబు.. మహాత్ముడికి నివాళి..

కేంద్రం వైఖరిని ఎండగట్టడానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వేదికగా ధర్మ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇవాళ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దేశ రాజధానిలోని ఏపీ భవన్‌ వద్ద బాబు దీక్ష చేయనున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజఘాట్‌ నుంచి బాబు నేరుగా ఏపీ భవన్‌కు వెళ్లి దీక్ష ప్రారంభిస్తారు.