వెంకటపాలెం చేరుకున్న బాబు..

వెంకటపాలెం చేరుకున్న బాబు..

ఇవాళ ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు బయలుదేరారు. వెలగపూడికి వెళ్లే ముందు వెంకటపాలెం చేరుకున్న చంద్రబాబు.. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక.. బాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలంతా కలిసి అసెంబ్లీకి చేరుకుంటారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఇవాళ తొలిరోజు సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత సీఎం జగన్, ఆ తర్వాత చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు.