మమతతో బాబు భేటీ..

మమతతో బాబు భేటీ..

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. కోల్‌కతాలోని మమత నివాసానికి వెళ్లిన చంద్రబాబు దాదాపు గంటపాటు సమాలోచనలు జరిపారు. ఎన్డీయేతర కూటమి ఏర్పాటుపై చర్చించారు. ఈ భేటీ ముగిశాక కోల్‌కతా నుంచి బాబు ఢిల్లీ వెళ్లారు. ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది.