కేజ్రీవాల్‌, ఏచూరితో బాబు భేటీ..

కేజ్రీవాల్‌, ఏచూరితో బాబు భేటీ..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల కమిషన్‌ అధికారులను కలిసిన చంద్రబాబు .. వెంటనే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులో భేటీ అయ్యారు. అక్కడి నుంచి 'ఆమ్‌ ఆద్మీ పార్టీ' అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లిన చంద్రాబాబు దాదాపు అరగంట పాటు సమాలోచనలు చేశారు. ఎన్నికల  ఫలితాల అనంతరం పరిణామాలు, మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై ఆయా నేతలతో బాబు చర్చించినట్టు తెలిసింది.