'రైతు దినోత్సవం'పై స్పందించిన చంద్రబాబు

'రైతు దినోత్సవం'పై స్పందించిన చంద్రబాబు

రైతులకు విత్తనాలు కూడా సరఫరా చేయలేని రాష్ట్ర ప్రభుత్వం..రైతు దినోత్సవం చేయడం హాస్యాస్పదం అని మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు విమర్శించారు. పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ చంద్రబాబు గుంటూరులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న రాజ్యం తెస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ రైతు వ్యతిరేక రాజ్యం తెచ్చారు' అని విమర్శించారు. 
విత్తనాల తయారీ అంటే ఉప్మా, ఇడ్లీ తయారు చేయడంకాదని సాక్షాత్తూ మంత్రి వ్యాఖ్యానించడం సరికాదన్న చంద్రబాబు.. రైతులపై ఈ ప్రభుత్వ వైఖరికి ఇదే నిదర్శనమని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే పార్టీ అజెండా అని, రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.