'ఈసీ సమాధానం చెప్పాల్సిందే..'

'ఈసీ సమాధానం చెప్పాల్సిందే..'

ఇంత పనికిమాలిన ఎలక్షన్ కమిషన్‌ను తానెప్పుడూ చూడలేదని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ నేరస్థులు చెబితే ఈసీ పాటిస్తోందన్నారు. 'వాళ్లు ఎవరిని బదిలీ చేయమంటే వాళ్లను బదిలీ చేశారు. ఈవీఎంలను రిపేర్‌ చేస్తామని చెప్పి ట్యాంపరింగ్ చేశారు. పునేఠాను మార్చి.. జగన్‌కు సహ నేరస్థుడి ఉన్న వారిని సీఎస్‌గా నియమించారు. ఎన్నిక జరుగుతుంటే సీఎస్ డీజీ ఆఫీసుకు వెళ్లారు' అని మండిపడ్డారు. 

ప్రజల భవిష్యత్తును ఒక యంత్రం మీద వదిలిపెట్టారన్న బాబు.. నిన్నటి ఈవీఎంల పనితీరు చూశాక నమ్మకం ఉంటుందా..? అని ప్రశ్నించారు. పేపర్ బ్యాలెట్ అయితే రిపేర్లతో సంబంధం ఉండేదే కాదన్న బాబు.. పొలింగ్ స్టేషన్లో రెండు గంటల పాటు పొలింగ్ నిలిస్తే.. అడ్జర్న్ ఓటింగ్ ఇవ్వాలని నిబంధన ఉన్నదని.. దీన్ని ఈసీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆపనని.. ఢిల్లీకి వెళ్తానని.. ఈవీఎంల వ్యవహరంపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పారు. రేపే ఢిల్లీ వెళ్లానని.. ఎందుకిలా చేశారో ఈసీనే అడుగుతానని తెలిపారు.