'ఏపీలో ఊహకు అందనంత వేవ్‌ ఉంది'

'ఏపీలో ఊహకు అందనంత వేవ్‌ ఉంది'

ఏపీలో సైలెంట్‌ వేవ్‌ ఉందని.. ఎవరి ఊహకూ అందనంత వేవ్‌ ఉందని సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఇవాళ అమరావతిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగన్‌ కోసం ఈస్థాయి వేవ్‌ ఉంటుందా అని ప్రశ్నించారు. సహజంగా పోలింగ్‌ మొదట్లో మందకోడిగా సాగి.. పుంజుకుంటుందని.. కానీ దీనికి భిన్నంగా ఉదయం నుంచే ఓటర్లు బారులుతీరారని తెలిపారు. ఈవీఎంలు పనిచేయకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైనా వైసీపీ ఒక్కమాట కూడా మాట్లాడలేదన్న ఆయన చెప్పారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు జగన్‌ ప్రచారంలో పాల్గొనకుండా విరామం ఇచ్చారని... ఈ సమయంలో హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో ఉండి కుట్రలు పన్నారని ఆరోపించారు. ఈసీని ప్రశ్నిస్తానని.. మంత్రులు, ఎంపీలతో ఢిల్లీ వెళ్తానని చెప్పారు. అవసరమైతే ధర్నా చేస్తానన్నారు.