ఇది వివక్ష కాదా..?: బాబు

ఇది వివక్ష కాదా..?: బాబు

ఇటువంటి ఎన్నికల సంఘాన్ని 24 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈసీ చర్యలు ఏకపక్షంగా, వివాదాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈసీ బాధ్యతతో వ్యవహరించడం లేదని.. ఎన్నికలు ముగిసిన 34 రోజుల తర్వాత ఏపీలో రీపోలింగ్‌ నిర్వహించడం సరికాదని అన్నారు. సాధారణంగా ఎన్నికలు జరిగిన మరుసటి రోజు రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా రీపోలింగ్‌ జరుపుతారని.. కానీ సుమారు నెల రోజులు దాటినప్పటికీ ఏపీలో వైసీపీ ఫిర్యాదు మేరకు  రీపోలింగ్‌కు ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. మోడీ, అమిత్‌షా చెప్పిన ప్రకారమే ఈసీ నడుచుకుంటోందని విమర్శించారు బాబు.

'పశ్చిమబెంగాల్‌లో అధికారి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటే తొలగించారు.  ఏపీ చీఫ్ సెక్రటరీ జోక్యం చేసుకుంటే చూసీచూడనట్టు వ్యవహరిస్తారు. ఇది వివక్ష కాదా..?' అని ప్రశ్నించారు. ఎన్నికలతో చీఫ్‌ సెక్రటరీకి సంబంధం ఉండదని అన్నారు. ఎన్నికల కమిషన్‌ ఏ ఒక్క పార్టీకీ అనుకూలంగా ఉండకూడదని బాబు అభిప్రాయపడ్డారు.