యూపీఏ భేటీకి టీఆర్‌ఎస్‌.. బాబు ఏమన్నారంటే..

యూపీఏ భేటీకి టీఆర్‌ఎస్‌.. బాబు ఏమన్నారంటే..

బీజేపీ, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా కలిసి పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇవాళ కేంద్రం ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

యూపీఏ సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్ఎస్‌కు ఆహ్వానం అందినట్టు వార్తలొచ్చాయని.. ఒకవేళ కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కలిసి వచ్చినా పనిచేస్తారా అని విలేఖరులు చంద్రబాబును ప్రశ్నించారు. 'ఎవరు కలిసి వచ్చినా పని చేస్తాం. మరీ హైపోథిటికల్‌ ప్రశ్నలు వద్దు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరొచ్చినా కలుస్తాం. ఏ పార్టీపైనా వివక్ష అక్కర్లేదు' అని సమాధానమిచ్చారు.