జగన్‌ దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా..: బాబు

జగన్‌ దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా..: బాబు

హైదరాబాద్‌లో వైఎస్ జగన్ షెల్ కంపెనీల భూములకు తెలంగాణ సీఎం కేసీఆర్ కాపలా ఉన్నారని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ ఉదయం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ జగన్‌కు సంబంధించిన మరిన్ని దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. జగన్‌ కేసులు నీరుగార్చడమే బీజేపీ, వైసీపీ లాలూచీకి నిదర్శనమన్న బాబు..  వైసీపీ-బీజేపీ-టీఆర్‌ఎస్‌ సంబంధం ఆధారాలతో సహా బయటపడిందని వ్యాఖ్యానించారు.ఓటమి భయంతోనే జగన్‌ తప్పులు మీద తప్పులు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.