కౌంటింగ్‌ వేళ బాబు కీలక సూచనలు

కౌంటింగ్‌ వేళ బాబు కీలక సూచనలు

టీడీపీ గెలుపును ఏ శక్తీ ఆపలేదని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్న నేపథ్యంలో పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కౌంటింగ్ పై నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఓట్ల లెక్కింపు ముగిసేవరకు కౌంటింగ్ కేంద్రంలో ఉండాలని సూచించారు. వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందాలని.. అటువంటి సమయంలో సంయమనం పాటించాలని సూచించారు.