వర్షాలు కురుస్తున్నా.. లోటు వర్షపాతమే..

వర్షాలు కురుస్తున్నా.. లోటు వర్షపాతమే..

వర్షాలు ఆశాజనకంగా ఉన్నా ఇంకా 14 శాతం లోటు వర్షపాతం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు - ప్రగతి, వ్యవసాయంపై సీఎం ఇవాళ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 8 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందని చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలకు ఇంకా 210 టీఎంసీల నీరు చేరాలన్నారు. ఉపరితల జలాలు, భూగర్భజలాలు సద్వినియోగం చేసుకోవాలని, సమర్థ నీటి నిర్వహణ ద్వారా నీటి కొరత అధిగమించాలని చంద్రబాబు సూచించారు.