నేడు బాబు కుప్పం పర్యటన

నేడు బాబు కుప్పం పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తారు. ఉదయం 9:30 గంటలకు కుప్పం చేరుకుంటారు. 10:30 గంటలకు స్థానిక ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకుంటారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, ఒడిబాల సమర్పిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం 11:30 గంటలకు బెంగళూరు వెళ్తారు. ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి నిన్ననే కుప్పం చేరుకున్నారు.