బాబు ప్రయత్నమంతా దొంగ సింపతీ కోసమే

బాబు ప్రయత్నమంతా దొంగ సింపతీ కోసమే

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నమంతా దొంగ సింపతీ కోసం చేస్తున్నదేనని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. గతంలో బాబ్లీ వెళ్లి కాంగ్రెస్ చేతిలో భంగపడ్డ చంద్రబాబు.. ఆ ప్రభుత్వం 22 నోటీసులు ఇచ్చినా  స్పందన లేదని, అందుకే non bailable వారెంట్ ఇచ్చారన్నారు. అదో న్యాయ ప్రక్రియ మాత్రమేనన్న నరసింహారావు దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. టీడీపీ నేతలు మరోసారి డ్రామాలకు తెరతీశారని, అప్పుడు మహారాష్ట్ర పోలీసుల దురుసు ప్రవర్తన కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. బాబుపై బీజేపీకి కక్ష సాధింపు అవసరం లేదని, ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారన్నారు. కేసులు తనపై రాకుండా అన్ని తంత్రాలు చంద్రబాబు చేస్తూనే ఉంటారని, ఓటుకి నోటు కేసులో బహిరంగంగా పట్టుబడిన బాబు దాన్నుంచి బయటపడేందుకు ఇప్పుడు మరో డ్రామాకు తెర తీశారన్నారు. విచారణకు హాజరైతే చంద్రబాబును A1, A 2 అని పిలుస్తారని భయమా అని ప్రశ్నించారు. రాహుల్ ను వాటేసుకుని డ్యూయెట్లు పాడుకుంటున్న బాబు... కాంగ్రెస్ హయాంలోనే ఇబ్బంది పడ్డ విషయం గుర్తుంచుకోవాలన్నారు. సినీ నటుడు శివాజీకి వేషాల్లేకపోవడం వల్లే ప్యాకేజీ తీసుకొని డ్రామాలాడుతున్నారు.