టీడీపీకి ఎన్ని సీట్లు..? బాబు అంచనా ఇదీ..

టీడీపీకి ఎన్ని సీట్లు..? బాబు అంచనా ఇదీ..

రాష్ట్రంలో నూటికి నూరు శాతం మళ్లీ టీడీపీనే గెలుస్తోందని.. ఇందులో రెండో ఆలోచన అక్కర్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. నిన్న అర్ధరాత్రి పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాలకు పైగా తెలుగుదేశం విజయ సాధిస్తుందన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.  
 అర్ధరాత్రి అయినా ఓటర్లు క్యూలైన్లలో ఓటు వినియోగించుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సానుకూలతకు నిదర్శనమన్న ఆయన.. ఓడిపోతున్నామనే అసహనంతో వైసీపీ పలు చోట్ల విధ్వంసాలకు తెరలేపిందని ఆరోపించారు. ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు టీడీపీ పక్షాన నిలిచారని అభిప్రాయపడ్డారు.
'అర్ధరాత్రి వరకు పోలింగ్‌ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు. కౌంటింగ్‌ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలి. స్ట్రాంగ్‌ రూంల వద్ద వచ్చే 40రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలి. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలి' అని చంద్రబాబు సూచించారు.