ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం: బాబు

ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం: బాబు

మహానాడు నిర్వహణపై పార్టీ ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో ఇవాళ భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మహానాడు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించారు. మహానాడు నిర్వహణకు మూడు రోజుల సమయం సరిపోదని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. నేతలంతా ఎన్నికల వ్యవహారాల్లో ఉన్నందున తక్కువ సమయంలో ఏర్పాట్లు అసాధ్యమని తేల్చి చెప్పారు. మూడు రోజులపాటు మహానాడు సాధ్యం కాకపోతే ఏం చెయ్యాలనే అంశంపైన చర్చించిన చంద్రబాబు.. ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.