రేపు రాజధానిలో చంద్రబాబు పర్యటన.. నల్ల జెండాలు పాతి నిరసన..!

రేపు రాజధానిలో చంద్రబాబు పర్యటన.. నల్ల జెండాలు పాతి నిరసన..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం రోజు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు.. అయితే, చంద్రబాబు పర్యటనకు నిరసనగా నల్ల జెండాలు పాతి నిరసనకు దిగారు అసైన్డ్ భూముల రైతులు. రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు అసైన్డ్ భూములు రైతులను మోసం చేశారని ఆరోపించారు.. అసైన్డ్ భూములు ఒక ప్యాకేజీ, పట్టా భూములకు మరో ప్యాకేజీ ఇచ్చి చంద్రబాబు దళితులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇది అన్యాయం అని అడిగితే గత ప్రభుత్వం మాపై తప్పుడు కేసులు పెట్టిందని విమర్శిస్తున్నారు. రాజధానిలో చంద్రబాబు ప్రభుత్వం దళితుల పట్ల తీవ్రమైన వివక్షత చూపిందని ఆరోపించిన అసైన్డ్ రైతులు.. చంద్రబాబు అసైన్డ్ భూముల రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు బినామీలు అసైన్డ్ భూములు కొన్న తర్వాత దళితులు సాగుచేస్తున్న అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగులోకి తీసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.