ఎన్ ఆర్ కమ్మపల్లె దగ్గర చెవిరెడ్డి అరెస్ట్

ఎన్ ఆర్ కమ్మపల్లె దగ్గర చెవిరెడ్డి అరెస్ట్

చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని రామచంద్ర పురం మండలం ఎన్ ఆర్ కమ్మపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎన్నికల సంఘం రీపోలింగ్ కి ఆదేశించిన ఐదు కేంద్రాలలో ఒకటైన ఎన్ ఆర్ కమ్మపల్లె గ్రామంలోకి వెళ్లాలని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నించారు. అయితే ఆయనను గ్రామంలోకి రానీయకుండా స్థానికులు అడ్డుకున్నారు. దళితులపై టీడీపీ నేతలు చేశారని, బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్నానని చెవిరెడ్డి నచ్చజెప్పబోయారు. ఇంతలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఎదురు పడటంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. ఈ విషయం తెలిసిన అర్బన్ ఎస్పీ అన్బురాజన్ దళితవాడను సందర్శించారు. గ్రామంలోకి ఇద్దరు నేతలు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా గ్రామంలోకి వెళ్లబోయిన చెవిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.