చంద్రయాన్‌-2 కౌంట్‌డౌన్‌ షురూ.. ఈసారి పక్కా..!

చంద్రయాన్‌-2 కౌంట్‌డౌన్‌ షురూ.. ఈసారి పక్కా..!

చంద్రయాన్‌-2 ప్రయోగానికి ఇవాళ సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. నిరంతరాయంగా 20 గంటలపాటు ఈ ప్రక్రియ కొనసాగి రేపు మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగం మొదలవుతుంది. జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక  చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని రోదసిలోకి తీసుకెళుతుంది.  

జులై 15న తెల్లవారుజామున నిర్వహించాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. దీంతో.. పెద్ద సవాల్ కింద తీసుకున్న ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ అతి తక్కువ సమయంలోనే సాంకేతిక లోపాల్ని సరిచేసి రీ లాంచ్ చేపట్టేందుకు సర్వం సిద్ధం చేశారు.