ఆకట్టుకుంటున్న చంద్రయాన్ గణపతి.!!

ఆకట్టుకుంటున్న చంద్రయాన్ గణపతి.!!

వినాయక చవితి దగ్గరికి వస్తోంది.  రకరకాల ఆకారాల్లో వినాయక విగ్రహాలు రెడీ అవుతున్నాయి.  ముఖ్యంగా ముంబై నగరంలో పూజలు అందుకునే గణపయ్యలను వివిధ ఆకారాల్లో తయారు చేస్తుంటారు.  లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా వినాయకులను తయారు చేస్తుంటారు.  ముంబైలో అత్యంత రద్దీగా ఉండే దేవాలయాల్లో లాల్ బాగ్చా దేవాలయం ఒకటి.  అక్కడ ప్రతి ఏడాది భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.  అంతేకాదు.. అక్కడ ఏర్పాటు చేసే వినాయకుడు చాలా కొత్తగా ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంటాడు.  

ఈసారి వినాయక చవితికి చంద్రయాన్ 2 గణపతిని ఏర్పాటు చేశారు.  గణపతి విగ్రహం పైనా ఇద్దరు వ్యోమగాములు .. విగ్రహం తల వెనక భాగంలో చంద్రయాన్ 2 ఉపగ్రహం..విగ్రహానికి వెనుక భాగంలో తెరను ఏర్పాటు చేసి.. చంద్రయాన్ 2 లాంచింగ్ కు సంబంధించిన విషయాలను చూపుతున్నారు. భారత ఖ్యాతిని గ్రహాంతరాలకు వ్యాపింపజేసిన ఇస్రోకు గుర్తుగా ఇలా వినాయకుడిని అక్కడ ప్రదర్శించారు.