నిలిచిపోయిన 'చంద్రయాన్‌-2'.. కారణం ఇదే..

నిలిచిపోయిన 'చంద్రయాన్‌-2'.. కారణం ఇదే..

భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా పడింది. క్రయోజనిక్‌ స్టేజ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వాయిదా వేస్తున్నామని ఇస్రో ప్రకటించింది. ఎప్పుడు ప్రయోగాస్తామనేదీ వెల్లడిస్తామని ఇస్రో అధికార ప్రతినిధి గురుప్రసాద్‌ చెప్పారు. ఈ ప్రయోగానికి 19 గంటల 4 నిమిషాల 36 సెకన్లపాటు కౌంట్‌డౌన్‌ కొనసాగి..మరో 56 నిమిషాల 24 సెకన్లు ఉందనగా వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వాస్తవానికి ఇవాళ వేకువజామున 2:51 గంటలకు చంద్రయాన్-2 నింగిలోకి పంపాలని శాస్త్రవేత్తలు భావించారు. రాకెట్ ఇంజిన్లలో ఇంధనాన్ని నింపారు. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు.