'చంద్రయాన్‌-2'పై ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు..

'చంద్రయాన్‌-2'పై ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు..

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో రేపు మధ్యాహ్నం జరిగే చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆదేశాలు జారీ చేశారు. చంద్రయాన్ 2 విశేషాలతోపాటు ప్రాముఖ్యతను తెలియజేసేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఈక్రమంలో డిజిటల్ తరగతులు, వర్చువల్ తరగతులు, టీవీ, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా  చంద్రయాన్ 2 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారానికి పాఠశాలల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.