సవ్యసాచి అలా మొదలైందట..!!

సవ్యసాచి అలా మొదలైందట..!!

నాగచైతన్యతో ప్రేమమ్ సినిమా చేసిన తరువాత నాగ చైతన్యతోనే మరో సినిమాకు కమిటైన దర్శకుడు చందు మొండేటి.  లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్ కథ ఇది.  ఎడమచేయి తన మాట వినదు.  వ్యానిషింగ్ సిండ్రోమ్ అనే ఆర్టికల్ చదివిన తరువాత దానిని స్ఫూర్తిగా తీసుకొని చందు ఈ కథను రెడీ చేసుకున్నారట.  నాగ చైతన్య, నాగార్జునలకు కథ వినిపించిన తరువాత మైత్రి మూవీ మేకర్స్ కు కథ వినిపించారు.  వారు కూడా ఈ సిండ్రోమ్ గురించి చాలా వరకు సెర్చ్ చేశారని చందు మొండేటి చెప్పారు.  

విలన్ రోల్ ప్లే చేస్తున్న మాధవన్ కు కథ చెప్పినపుడు, చాలా ఎగ్జైట్ అయ్యారట.  వెంటనే ఓకే చేశారని అలా సవ్యసాచి మొదలైందని చందు మొండేటి చెప్పుకొచ్చారు.  రెగ్యులర్ గా అన్ని సినిమాల్లో ఉన్నట్టే లవ్, అఫెక్షన్, యాక్షన్ అన్ని ఉంటాయని చందు అంటున్నాడు.