మారిన మోడీ టూర్... కొత్త షెడ్యూల్ ఇదే
ప్రధాని మోదీ రేపటి హైదరాబాద్ టూర్ సమయం మారింది. రేపు సాయంత్రం హైదరాబాద్ కు రావాల్సిన ప్రధాని.. ఒంటిగంటకు నగరానికి చేరుకోనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి హకీంపేట్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు ప్రధాని మోడీ. అనంతరం భారత్ బయోటెక్ చేరుకుంటారు. తిరిగి 3 గంటలకి హకీంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి బయల్దేరుతారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రాంగణం ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ దాదాపు గంట సేపు గడిపే మోడీ... కరోనా వ్యాక్సీన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు. కార్యక్రమం పూర్తయ్యాక నేరుగా ఢిల్లీ వెళ్లిపోతారు.
గ్రేటర్ ఎన్నికలతో కానీ, ప్రచారంతో కానీ మోడీకి సంబంధం లేకపోయినా... హైదరాబాద్‌లో ఆయన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణంగా ప్రధానికి సంబంధించిన ఏ పర్యటన అయినా.. రెండువారాల ముందు ఖరావుతుంది. కానీ, ఈ టూర్ ఆకస్మికంగా ఖరారైంది. దీంతో, మోడీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ సభతో ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్న టీఆర్ఎస్ కు కౌంటర్ గానే. ప్రధాని పర్యటనను బీజేపీ ప్లాన్ చేసి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బిజెపి అగ్రనాయకత్వం మొత్తం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా ఇప్పుడు ప్రధాని పర్యటన ఆసక్తిగా మారింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)