చరణ్ @ 35 రోజులు

చరణ్ @ 35 రోజులు

రామ్ చరణ్.. బోయపాటి సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దీపావళికి రిలీజ్ చేయాలనే సంకల్పంతో బోయపాటి యూనిట్ పనిచేస్తున్నది.  యూనిట్ లో కొద్దిపాటి మార్పులను కూడా చేసింది.  బోయపాటి సరైనోడు సినిమాకు సినిమాటోగ్రఫీ చేసిన రిషి పంజాబీని పక్కన పెట్టి తనకు రెగ్యులర్ గా సినిమాటోగ్రఫీ చేసే ఆర్థర్ విల్సన్ ను లైన్లోకి తీసుకొచ్చాడు బోయపాటి.  ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.  తాజా సమాచారం ప్రకారం ఇంకా 35 రోజులపాటు షూటింగ్ చేయాల్సి ఉందట.  ఒకవైపు షూటింగ్ చేస్తూనే.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్, ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాలని చూస్తున్నది.  వచ్చే ఏడాది జనవరి 11 న సినిమాను రిలీజ్ చేయాలని బోయపాటి యూనిట్ అనుకుంటున్నట్టు సమాచారం. చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్.