బోయపాటి సినిమాకు కసరత్తులు మొదలెట్టిన చరణ్

బోయపాటి సినిమాకు కసరత్తులు మొదలెట్టిన చరణ్
రామ్ చరణ్ తాజాగా రంగస్థలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇందులో రామ్ చరణ్ లేని సన్నివేశాలను ఇతర నటీనటులపై చిత్రీకరించారు. ఇక ఈనెల చివరి వారం నుండి చరణ్ ఈ సినిమా సెట్స్ లో అడుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో తన లుక్ ను మార్చే పనిలో చరణ్ నిమగ్నమయ్యాడని తెలుస్తోంది. ఇదే క్రమంలో భార్య ఉపాసన పర్యవేక్షణలో స్పెషల్ డైట్ ను తీసుకుంటున్నారట. రంగస్థలంలో పల్లెటూరి యువకుడిగా మాస్ లుక్ లో దర్శనమిచ్చిన చరణ్..ఈ ప్రాజెక్టులో ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో దర్శనమివ్వనున్నాడని సమాచారం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండనున్న ఈ సినిమాకు రాజవంశస్తుడు అనే పవర్ ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతోంది. మొదటి సారి చరణ్, బోయపాటిలు కలవడంతో ఆరంభం నుండే మంచి పాజిటివ్ హైప్ ఏర్పడింది. దసరా నాటికి అన్నిరకాల నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఇనీషియల్ ప్లాన్ వేశారు.