లాభాల్లో వాటా అడుగుతున్న ఎన్టీఆర్, చరణ్ !

లాభాల్లో వాటా అడుగుతున్న ఎన్టీఆర్, చరణ్ !

రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.  ఈ భారీ మల్టీస్టారర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.  చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ స్టార్ హీరోలే కావడంతో సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే విషయంపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి ఉంది. 

అయితే సినీ వర్గాల సమాచారం మేరకు ఈ ఇద్దరు హీరోలు పారితోషకం ఏమీ తీసుకోవడంలేదట.  కానీ లాభాల్లో వాటా మాత్రం తీసుకుంటారట.  వీరి తరహాలోనే దర్శకుడు రాజమౌళి కూడ పారితోషకం లేకుండా లాభాల్లో వాటా తీసుకుంటారట.  డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.