చరణ్ తో ఫైట్ కు సిద్ధం అవుతున్న కియారా..!!

చరణ్ తో ఫైట్ కు సిద్ధం అవుతున్న కియారా..!!

మహేష్ బాబుతో తెలుగులో భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా చేసిన కియారా అద్వానీ అటు చరణ్ తో వినయ విధేయ రామ చేసింది.  ఈ సినిమా ప్లాప్ అయ్యాక తెలుగులో మరో సినిమాకు సైన్ చేయలేదు.  బాలీవుడ్లో కబీర్ సింగ్ అవకాశం రావడంతో అటు వెళ్ళిపోయింది.  కబీర్ సింగ్ సూపర్ హిట్ తరువాత అక్షయ్ కుమార్ తో కాంచన రీమేక్ సినిమా లక్ష్మి బాంబ్ లో చేసే అవకాశం దక్కింది.  

ఈ సినిమాతో సెట్స్ మీద ఉన్నది.  దీంతో పాటు మరో హర్రర్ కామెడీ సినిమాకు కూడా కియారా సైన్ చేసింది.  అదే భూల్ బులియా 2.  హిందీ చంద్రముఖి సినిమాకు కొనసాగింపుగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.  ఆయుష్మాన్ ఖురానా హీరో.  అనీష్ భాజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కబీర్ సింగ్ నిర్మాతలు నిర్మిస్తున్నారు.  ఈ మూవీని జులై 31, 2020న రిలీజ్ చేయబోతున్నారు.  రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా జులై 30న రిలీజ్ కాబోతున్నది.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  బాహుబలి సీరీస్ తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి నెలకొన్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజైన మరుసటి రోజునే కియారా భూల్ బులియా 2 రిలీజ్ అవుతున్నది.  ఆర్ఆర్ఆర్ పోటీని తట్టుకొని సినిమా నిలబడుతుందా... చూద్దాం.