అక్కడ ఫోన్ సర్వీసులు ఆగిపోయినా.. బిల్లుల మోత తప్పలేదు..!! 

అక్కడ ఫోన్ సర్వీసులు ఆగిపోయినా.. బిల్లుల మోత తప్పలేదు..!! 

ఆగష్టు 5 వ తేదీ నుంచి జమ్మూ కాశ్మీర్లో ఫోన్లు మూగబోయాయి.  బిఎస్ఎన్ఎల్ మొదలు అన్ని సర్వీసులను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ముందు జాగ్రత్తగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.  ఆ రాష్ట్రానికి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు తరువాత మొబైల్ ఫోన్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేశారు.  కాగా, ఇప్పుడిప్పుడే తిరిగి సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. సర్వీసులు ఆగిపోయిన బిల్లుల మోత మాత్రం తప్పడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు.  

ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్ తదితర సర్వీసుల నుంచి బిల్లులు చెల్లించాలని మెసేజ్ లు, మెయిల్ లు వస్తున్నాయని, సర్వీసులు నిలిపివేసిన సమయంలో బిల్లులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తే దానికి ఆయా సర్వీసులు సమాధానం చెప్పడం లేదని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. గతంలో 2014లో వరదలు వచ్చినపుడు, 2016లో అల్లర్లు జరిగిన సమయంలో ఇలానే సర్వీసులు కట్ చేశారని.. అప్పుడు బిల్లుల నుంచి మినహాయింపు ఇచ్చినట్టు ప్రజలు చెప్తున్నారు.  ఇప్పుడు అలాగే మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.  స్కూల్ బస్సుల నుంచి కూడా ఇదే విధమైన బిల్లులు వస్తున్నట్టు ప్రజలు పేర్కొంటున్నారు.