అంతర్వేదిలో అగ్నిప్రమాదం : కాలిపోయిన శ్రీలక్ష్మినరసింహస్వామివారి రథం !

అంతర్వేదిలో అగ్నిప్రమాదం : కాలిపోయిన శ్రీలక్ష్మినరసింహస్వామివారి రథం !


తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో అగ్నిప్రమాదం జరిగింది. శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. స్వామివారి రథం అగ్నికి ఆహుతి కావడంతో..  అర్చకులు, భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈప్రమాదం షార్ట్‌ సర్క్యూట్ వల్ల జరిగిందా..? ఎవరైనా తగులబెట్టారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రథానికి 62 ఏళ్ల చరిత్ర ఉందని అర్చకులు చెబుతున్నారు. దీనికి సంబందించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.