పాక్‌ అదుపులో ఉన్న భారత పైలట్‌ క్షేమం..

పాక్‌ అదుపులో ఉన్న భారత పైలట్‌ క్షేమం..

పాకిస్థాన్‌ ఆర్మీ చేతికి చిక్కిన భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ క్షేమంగా ఉన్నారు. పాక్ సైన్యం అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన తొలిసారిగా మాట్లాడారు. పాక్‌ ఆర్మీ తనను బాగా చూసుకుంటోందని చెప్పారు. 'జియో న్యూస్‌' జర్నలిస్టు అజార్‌ అబ్బాస్‌ ఆ వీడియోను ట్వీట్‌ చేశారు. పాక్‌ జవాన్లు ట్రీట్‌ చేస్తున్న విధానం బాగుందని.. జెంటిల్‌ మెన్‌లా ప్రవర్తిస్తున్నారని చెప్పారు.  అల్లరి మూక తనపై దాడి చేస్తుండగా పాక్‌ సైనికులు కాపాడారని అభినందన్‌ తెలిపారు. భారత్‌లో తనది ఏ ప్రాంతం అడి అడగ్గా.. దక్షిణాదికి చెందిన వాడినని చెప్పిన అభినందన్‌.. జవాన్లు ఇచ్చిన టీ బాగుందంటూ కితాబిచ్చారు. 'మీరు నడిపిన ఎయిర్‌క్రాఫ్ట్‌ ఏది?' అని ప్రశ్నించగా.. తాను చెప్పదల్చుకోలేదని అన్నారు. 'మీ మిషన్‌ ఏంటి?' అని అడగ్గా.. అది కూడా చెప్పేందుకు అభినందన్‌ నిరాకరించారు.