స్టార్ హీరోయిన్‌పై ఛీటింగ్ కేసు

స్టార్ హీరోయిన్‌పై ఛీటింగ్ కేసు

 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై ఛీటింగ్ కేసు నమోదుచేశారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.  గతేడాది ఒక స్టేజ్ ప్రోగ్రామ్ కోసం రూ.25 లక్షల రెమ్యునరేష్ తీసుకున్న సోనాక్షి ఆ కార్యక్రమానికి  హాజరుకాలేదని, పైగా తీసుకున్న డబ్బు చెల్లించలేదని కొందరు పోలీసులకు పిర్యాదు చేశారు.  పోలీసులు సోనాక్షిపై ఐపిసి 420, 406 కింద కేసులు నమోదు చేశారు.  ఒక పోలీస్ బృందం కూడా విచారణ నిమిత్తం ముంబైలోని సోనాక్షి ఇంటికి వెళ్లగా ఆమె అక్కడ లేదు.  ఆమె అందుబాటులోకి రాగానే పోలీసులు విచారణను కొనసాగించనున్నారు.