హైదరాబాద్ లో మళ్లీ చెడ్డి గ్యాంగ్ అలజడి

హైదరాబాద్ లో మళ్లీ చెడ్డి గ్యాంగ్ అలజడి

హైదరాబాద్ లో చెడ్డి గ్యాంగ్ మళ్లీ తిరుగుతుందా ..?  అవుననే అనుపిస్తుంది పోలీసుల దర్యాప్తు బట్టి.. ఆ అనుమానంతోనే పోలీసులు సిటి అంతా గాలిస్తున్నారు. శుక్రవారం కేపిహెచ్ బి పరిధిలోని ఎన్ఆర్ ఎస్ కాలనీతో సహా మూడు కాలనీల్లో దొంగతనానికి దొంగల ముఠా యత్నించింది. సీసీ కెమెరా లో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి చూస్తే,  దొంగతనానికి యత్నించిన గ్యాంగ్  చెడ్డి గ్యాంగ్  అయి ఉంటుందనే  కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీలకు యత్నించిన ఇంటి దగ్గరికి చేరుకున్న పోలీసులు, సిసి కెమెరా దృశ్యాల ఆధారంగా   దర్యాప్తు ప్రారంభించారు. సంక్రాంతి పండగ టార్గెట్ గా చేసుకున్న ఈ ముఠా దొంగతనాలకు దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.. ఊళ్లకు వెళ్లే ప్రజలు సైతం అప్రమత్తంగా వ్యవహారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.