ఏం ఉరికింది భయ్యా... మెరుపు వేగమంటే ఇదేనేమో.!

     ఏం ఉరికింది భయ్యా... మెరుపు వేగమంటే ఇదేనేమో.!

ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చిరుత పులే అని మరోసారి రుజువైంది. పరిగెత్తేటప్పుడు తన స్పీడ్ ఎలా ఉంటుందో నెటిజన్లకు రుచి చూపించింది. చిరుత ఓ జింక జాతికి చెందిన గజల్ ను వెంటాడే వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్ అయింది. ఆ వీడియోలో చీతా  గెజెల్‌ను వెంటాడుతోంది. గెజెల్ దానిని నుంచి తప్పించుకోవడానికి అటు ఇటు తిరిగినప్పటికీ చీతా తన పొడవైన తోకతో అద్భుతంగా బ్యాలన్స్ చేస్తూ పరిగెత్తడం విశేషం. ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి సుషాంత నంద ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇక ఈ వీడియో చుసిన నెటిజన్లంతా చిరుత వేగానికి ఫిదా అవుతున్నారు.