రజినీకాంత్ సినిమాలో త్రిష..!!

రజినీకాంత్ సినిమాలో త్రిష..!!

కాలా సినిమా తరువాత రజినీకాంత్..కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న  సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ షెడ్యూల్ మధురై పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది.  ఇదిలా ఉంటె, ఈ సినిమాలో రజినీకాంత్ రెండు షేడ్స్ లో కనిపించబోతున్నట్టు సమాచారం.  విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధికి, సిమ్రాన్ తదితరులు నటిస్తున్నారు.  కాగా, ఇప్పుడు మరో తమిళ స్టార్ నటి త్రిష కూడా ఈ సినిమాలో జాయిన్ అయింది.  రజినీకాంత్ తో త్రిషకు ఇదే మొదటి సినిమా.  అటు సిమ్రాన్ కూడా రజినీతో నటించడం ఇదే  మొదటిసారి. 

సన్ నెట్ వర్క్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నది.  రజినీకాంత్ ఇప్పటివరకు చేయని సబ్జెట్ తో కార్తీక్ సుబ్బరాజ్ సినిమా చేస్తున్నాడు.  వచ్చే ఏడాది నుంచి రజిని రాజకీయాలతో బిజీ కానుండడంతో.. ఈ సినిమాను వీలైనంతగా స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు.