చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలిచింది

చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలిచింది

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సురేశ్‌రైనా (57, 41బంతుల్లో 7ఫోర్లు,1సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడికి చివర్లో రవీంద్ర జడేజా(31, 17 బంతుల్లో 5ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. దీంతో రెండు బంతులు మిగులుండగానే విజయం సాధించారు. కోల్ కత్తా బౌలర్లలో హారీ గుర్నీ ఒక వికెట్, సునీల్ నరైన్, పియూష్ చావ్లా తలో రెండు వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టును ఓపెనర్ క్రిస్ లిన్ (82, 51 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులు) ఆదుకున్నాడు. చెన్నై స్పిన్‌ బౌలర్‌ ఇమ్రాన్‌తాహిర్‌ నాలుగు కీలక వికెట్లు తీసి కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేశాడు. శార్దుల్‌ ఠాకుర్‌ రెండు, మిచెల్‌ శాంట్నర్‌ ఒక వికెట్‌ తీశారు.